calender_icon.png 2 August, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వ్యక్తిత్వానికి రిటైర్మెంట్ లేదు’

01-08-2025 12:38:50 AM

సిద్దిపేట క్రైమ్, జూలై 31 : రిటైర్మెంట్ అనేది వృత్తికి మాత్రమే, వ్యక్తిత్వానికి కాదని ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వన్టౌన్ ఎస్త్స్రలు కోల కనకయ్య, మేకల కొమురయ్య, ట్రాఫిక్ ఏఎస్త్స్ర వడపల్లి రఘులకు గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందారని కొనియాడారు. అనంతరం  వారికి అభినందనలు తెలియజేస్తు రిటైర్డ్మెంట్ బెనిఫిట్ పత్రాలు అందచేశారు. అత్యవసరం అయినప్పుడు రిటైర్డ్ పోలీస్ అధికారుల సేవలు వినియోగించుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్, రాజేష్, ధరణి కుమార్, విష్ణు ప్రసాద్, సీసీ నితిన్, రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.