ఇల్లు మంజూరు చేస్తాం నిర్మించుకోండి
గుడిసెల్లో నివాసం ఉంటున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
మూసాపేట జూన్ 22 : ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటున్నామని ప్రతి ఒక్కరు సొంత ఇల్లు నిర్మించుకునే దిశగా అడుగులు వేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొమ్మిరెడ్డి పల్లి గ్రామంలో హౌసింగ్ ఎండీ వీపి గౌతమ్ తో కలిసి ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి, ఇల్లు లేక గుడిసెల్లో నివసిస్తున్న వారి గుడిసెలను పరిశీలించి, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని, వారికి తక్షణమే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే భరోసాని ఇచ్చారు.
అనంతరం నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల ఎంపీడీవోలతో మాట్లాడి ఇందిరమ్మ ఇండ్ల ఎలల్ 2, 3 సమస్యల గురించి ఎండి తో చర్చించి, పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.
వ్యవసాయ మార్కెట్ యార్డ్ మంజూరుతో ఎంతో మేలు
అడ్డాకుల జూన్ 22 : మండల కేంద్రానికి వ్యవసాయ మార్కెట్ యార్డ్ మంజూరు కావడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో జి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ దేవరకద్ర నియోజకవర్గంలో చెస్తున్న అభివృద్ధిని వివరిస్తూ కొనియాడారు.
గతంలో అడ్డాకుల, మూసాపేట మండలాలు మదనపురం మార్కెట్ కు భూత్పూర్ మండలం జడ్చర్ల మార్కెట్ కు ఉండేవి రైతుల ఇబ్బందులు గమనించి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను అడ్డాకుల మండల కేంద్రంలో మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కిషన్ సేల్ అధ్యక్షులు కందూరు నాగిరెడ్డి, డిసిసి కార్యదర్శి గంగుల విజయమోహన్ రెడ్డి డిసిసి జిల్లా సెక్రెటరీ పాశం తిరుపతయ్య యాదవ్ మార్కెట్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి కొండ జగదీశ్వర్ రెడ్డి పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






