calender_icon.png 23 May, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి

22-05-2025 12:20:12 AM

జీఎన్ రావు కన్నుమూత

ముషీరాబాద్, మే 21 (విజయక్రాంతి): విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి గోపిశెట్టి నాగేశ్వరరావు గుండెపోటుతో బుధవారం రాత్రి కన్నుమూశారు. 1988 బ్యాచ్‌కు చెందిన జీఎన్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ హోదాలలో పనిచేసి అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు.

గుంటూరు కలెక్టర్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువజన సర్వీసెస్ శాఖ కమిషనర్ గా, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా, జౌళి శాఖ కమిషనర్ గా, ఉన్నత విద్య శాఖ కమిషనర్ గా శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గా, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందించారు. ఆయన అకాల మృతి పట్ల పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో శుక్రవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.