calender_icon.png 14 July, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాగల కార్యం ‘ఆయనే’ తీర్చాడా?

13-07-2025 12:12:09 AM

బీజేపీ అంటేనే హిందుత్వ అని ఆ పార్టీ కార్యకర్తలు గొప్పగా చెబుతారు. ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ వంటి హిందుత్వ సంస్థలు ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తాయి. అలాంటి హిందుత్వ పార్టీలో తెలంగాణలో ఖట్టర్ హిందువుగా రాజాసింగ్ పేరే మొదటవస్తుంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్..బీజేపీకి ఓ ఆస్తి లాంటి నేతగా పేరొందారు. అందరూ ఓడిపోయినా గెలిచే వ్యక్తిగా ముద్ర పడ్డారాయన.

రాజాసింగ్ అంటే బీజేపీ..బీజేపీ అంటే రాజాసింగ్ అనేలా పేరున్న ఈ ఖట్టర్ హిందూ పార్టీకి రాజీనామా చేయడం..తర్వాత అధిష్ఠానం ఆమోదించడంతో, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈవిషయాన్ని మీడియాకు వెల్లడించేందుకు రాష్ట్ర పార్టీ ఎంతో ఉత్సాహాన్ని చూపినట్లు కనిపిస్తోందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. పార్టీ నేతలకు కంట్లో నలుసులా మారిన రాజాసింగ్ స్వయంగా రాజీనామా చేయడంతో కాగల కార్యం గంధర్వులు పూర్తి చేసినట్లుగా పార్టీ నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

 విజయభాస్కర్