calender_icon.png 1 October, 2025 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్తారంలో దొంగల బీభత్సం

01-10-2025 01:35:34 AM

హుజురాబాద్, సెప్టెంబర్ 30:(విజయ క్రాంతి) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని ఎల్లమ్మ, మైలాల మల్లన్న దేవాలయాల్లో సోమవారం రాత్రి చోరీ జరిగినట్లు గౌడ సంఘం, యాదవ సంఘం నాయకులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు బొంగోని రవీందర్, కార్యదర్శి పంజాల లక్ష్మణ్ గౌడ్, యాదవ సంఘం అధ్యక్షులు మారవేణి రాజయ్యలు మాట్లాడుతూ..

గ్రామ శివారులో గల ఎల్లమ్మ దేవాలయం, మైలాల మల్లన్న దేవాలయాల్లో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడి, అమ్మవారి 4 గ్రాముల బంగారు పుస్తెలు,10 గ్రాముల వెండి హారం, ఆలయంలో ఉన్న హుండీని పగలగొట్టి రూ. 20వేల పై చిలుకు డబ్బులను,

మైలాల మల్లన్న ఆలయంలో రెండు గ్రాముల బంగారు పుస్తెలు, హుండీ పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారని తెలిపారు. గౌడ సంఘం నాయకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, క్లూస్ టీం తో వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు శంకరపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్ రెడ్డితెలిపారు.