calender_icon.png 4 October, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టపడిన వారికి పార్టీ అండగా ఉంటుంది: ఎమ్మెల్యే వంశీకృష్ణ

03-10-2025 11:43:20 PM

అచ్చంపేట: పార్టీ కోసం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం కోసం నిత్యం పనిచేస్తున్న వారికి రాబోయే ఎన్నికల్లో పార్టీ అండగా ఉంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన బల్మూర్ మండల కాంగ్రెస్ గ్రామాధ్యక్షులు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడే వారికే అవకాశాలు లభిస్తాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ అవగాహన లేని వారు తప్పుడు ప్రచారం చేయకూడదని హెచ్చరించారు. ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి విజయం సాధించేలా కృషి చేయాలని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేర్చాలని కార్యకర్తలకు సూచించారు.