04-10-2025 12:18:22 AM
బెల్లంపల్లి, అక్టోబర్ 3 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో డిఈఈ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్)గా పనిచేస్తు న్న అరుణ్ కుమార్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించారు. దసరా వేడుకల్లో భాగంగా జమ్మి చెట్టు వద్ద కు పూజలు నిర్వహించి గ్రామస్తులు శుభాకాంక్షలు తెలుపు కుంటున్న సమయంలో ఒక్కసారిగా అతిగా మద్యం సేవించిన అరుణ్ కుమార్ తనకారుతో అక్కడ వేడుకల్లో పాలుపంచు కుంటు న్న గ్రామస్తులను అతివేగంగా ఢీకొట్టాడు.
ఈ ఘటనలో బుచ్చయ్య పల్లి గ్రామానికి చెందిన రణవేని రఘు అనే యువకుని కాలికి గాయం కాగా, పందుల రాజు అనే యువకుని చేయి విరిగింది. వీరితోపాటు మరో మధు, పవన్ అనే మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. స్థానికుల కథనం మేరకు ఆకెనపల్లి గ్రామానికి చెందిన పోలంపల్లి అరుణ్ కుమార్ ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా రు. దసరా పండుగ కోసం గ్రామానికి వచ్చారు. గురువారం సాయంత్రం తన స్నేహితులతో కలసి పెద్ద దుబ్బ గ్రామ పరిసరాల్లోని పొలం వద్ద మద్యం సేవించారు.
మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ బుచ్చయ్యపల్లి గ్రామం వద్ద దసరా వేడుకల్లో భాగంగా జమ్మి చెట్టు వద్ద పూజలు చేసేందుకు వస్తున్న గ్రామస్తులను ఢీ కొట్టి ఆకెనపల్లి వైపుకు వేగంగా కారును నడుపుకుంటూ వెళ్లారు. ప్రమాదం నుంచి చేరుకు న్న మరికొంతమంది గ్రామస్తులు కారు వెంట ద్విచక్ర వాహనాలతో వెంబడించి ఆకెనపల్లి గ్రామంలో కారు ను అడ్డుకొని డీఈ ఈ అరుణ్ కుమార్ ను చితకబాదారు. బుచ్చయ్యపల్లి గ్రామస్తులు ఆగ్రహంతో కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. తాళ్ల గురిజాల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.