calender_icon.png 4 October, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గమ్మ ఆశీస్సులతో అభివృద్ధి సాధించాలి

04-10-2025 12:16:15 AM

ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు

కాగజ్ నగర్ అక్టోబర్ 3(విజయక్రాంతి) : పారిశ్రామిక ప్రాంతమైన దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం సాయంత్రం పట్టణంలోని త్రిశూల్ పహాడ్ గుట్టపై ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గుట్టపై షమీ పూజలు, రావణ దహన కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించారు. జమ్మి పంచుతూ, ఆలింగణం చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 

పట్టణంలోని పలు కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ నిమజ్జన శోభాయాత్రలు కన్నుల పండువగా నిర్వహించారు. డీజే చప్పుళ్ల మధ్య యువకుల నృత్యాలతో సందడి వాతావరణం నెలకొంది. వెళ్లి.. మళ్లీ రా.. దుర్గమ్మ తల్లి అంటూ, నీ చల్లని ఆశీస్సులతో అభివృద్ధి సాధించాలని ప్రజలు వేడుకున్నారు. పోలీసులు భారీ బందోసేర్పడేవారు.