calender_icon.png 4 October, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వరాలలో రోడ్డుపై ముసలి కలకలం

03-10-2025 11:48:46 PM

రాత్రి వేళ భయం భయంతో ప్రయాణికులు

వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామ శివారులో ముసలి సంచారం స్థానికుల్లో కలకలం రేపింది. శుక్రవారం రాత్రి పెబ్బేరు నుంచి కారులో వస్తున్న వీపనగండ్ల మండలానికి చెందిన ఓ వ్యక్తి వెంకటేశ్వరరావు బావి రైస్ మిల్ దగ్గర బ్రిడ్జి వద్ద ముసలి కనిపించడంతో తీవ్ర భయానికి గురయ్యారు. ఈ ఘటనతో రాత్రి వేళల్లో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, పంట పొలాలకు వెళ్లే కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ముసలిని పట్టుకోవాలని, ప్రయాణికుల భద్రతను కాపాడాలని కోరుతున్నారు.