calender_icon.png 4 October, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా దుర్గాదేవి శోభయాత్ర

03-10-2025 11:40:17 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ న్యూ నాగార్జున కాలనీలో శుక్రవారం దుర్గాదేవి శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారు శరన్నవరాత్రోత్సవాలలో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చింది. నూతి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో శ్రీ విజయ కనక దుర్గా భక్త మండలి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు ఆఖరి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలతో పాటు అమ్మవారి ముందు ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీచక్రానికి వేలం పాట నిర్వహించగా భక్తులు పోటీపడ్డారు.

కోలాటాలు, నృత్యాలు నడుమ శోభయాత్ర...

డబ్బు చప్పుళ్లు, డీజే(DJ) సౌండ్లకు మహిళల కోలాటాలు, యువకుల నృత్యాల మధ్య అమ్మవారి శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భవానీ మాల వేసిన భక్తులు, మహిళల నడుమ ఆధ్యాంతం భక్తిపారవశ్యంలో అమ్మవారి యాత్ర కొనసాగింది. భక్తులు అమ్మవారి రథానికి నీళ్లు చల్లి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబాలు మంగళ హారతులతో అమ్మవారికి స్వాగతం పలుకుతూ శోభ యాత్ర వెంట నడిచారు. అనంతరం సమీప గోదావరి నదీ తీరంలో నిమజ్జనం చేశారు.