09-08-2025 02:01:24 AM
ఇక నుంచి విజయమే
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్
హుస్నాబాద్, ఆగస్టు 8 : ఇటీవలి ఎన్నికల ఫలితాలను కేవలం తాత్కాలిక విరా మంగానే చూడాలని, ఇక నుంచి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత వొడితల సతీశ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని బీఆర్‌ఎస్ ఆఫీసులో ఎల్కతుర్తి, సైదాపూర్ మండలాల ముఖ్య కార్యకర్తలతో జరిగిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీ శ్రేణుల్లో ఆయన మాటలు కొత్త ఉత్సాహాన్ని నింపా యి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలి. గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరవేయాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపై ఉందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తీవ్ర విమర్శలు చేశారు. మనం చేసిన అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లి, వారికి నిజాలు తెలియజేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు.
రైతుల పక్షాన నిలబడతం
గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల కుటుంబాల్లో సంతోషం నింపితే, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని సతీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిల బడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రజలే నా బలం, నా బలగం. ఏ సమస్య వచ్చి నా నేను మీకు అండగా ఉంటానన్నారు.