calender_icon.png 24 October, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

24-10-2025 12:14:51 AM

  1. విద్య, వైద్యంపై ఎమ్మెల్యే స్పెషల్ ఫోకస్ !

పాఠశాలలు, ఆసుపత్రుల  ఆకస్మిక తనిఖీ

మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు

మెదక్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. గురువారం మెదక్ మండలంలోని రాజ్పల్లి జడ్పిహెచ్‌ఎస్, మెదక్ లోని గవర్నమెంట్ గరల్స్ హైస్కూల్, బాలికల రెసిడెన్షియల్ స్కూల్ తో పాటు ప్రభుత్వ హాస్పిటల్ ను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి కన్న తల్లిదండ్రులకు, విద్యాబోధన చేసిన గురువులకు పేరు ప్రతిష్ట లు తీసుకురావాలని సూచించారు. సమాజంలో ఉన్న గొప్పగొప్ప వాళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనన్నారు. విద్యార్థులు మంచి మార్కులు, గ్రేడింగ్ తెచ్చుకొని జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

డాక్టర్లు, సిబ్బంది నిరంతరం రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. ప్రభుత్వ హస్పిటల్ లో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొజ్జ పవన్, దొంతి ముత్యం గౌడ్, అరవింద్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పరుశరామ్ గౌడ్, నియోజకవర్గ అధ్యక్షులు భరత్ గౌడ్ లతో పాటు ఆయా పాఠశాలల టీచర్లు, వైద్యులు, సిబ్బందిపాల్గొన్నారు.