calender_icon.png 19 November, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవంబర్ 25న చలో మత్స్యకార చలో కరీంనగర్

19-11-2025 08:01:10 PM

మత్స్యకారుల బహిరంగ సభకు వేలాదిగా తరలిరండి 

రాష్ట్ర ఉపాధ్యక్షులు మురారి మోహన్

నకిరేకల్ (విజయక్రాంతి): ఈనెల 25, 26, 27 తేదీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ మత్స్యకార్మిక సంఘం(TMKMKS) రాష్ట్ర 4వ మహాసభలు జరుగునున్నాయి. ఈ మహాసభల సందర్భంగా మొదటి రోజు నవంబర్ 25న  నిర్వహించే బహిరంగ సభ, ప్రదర్శనకు మత్స్యకారుల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురారి మోహన్ కోరారు. బుధవారం కట్టంగూరు మండలంలోని ఈదులూరు గ్రామంలో మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో బహిరంగ సభ పోస్టర్ ను ఆయన ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే బడ్జెట్లో మత్స్య వృత్తి రక్షణ-మత్స్యకారుల సంక్షేమానికి రూ/- 5000 కోట్లు కేటాయించి, ఖర్చుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.  

తెలంగాణ రాష్ట్రంలో మత్స్యవృత్తి పై ఆధారపడి పది లక్షల మత్స్యకారుల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి, సుమారు 5650 మత్స్య సహకార సంఘాల్లో 5లక్షల 40 వేల మంది సభ్యులుగా ఉన్నారని ఆయన తెలిపారు. మత్స్యకారుల జీవిత భద్రతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయి, మత్స్యకారులు ప్రతిరోజు దినదినగండంగా ప్రమాదకరమైన వృత్తి చేస్తున్నారు. మత్స్యకారుల జీవిత భద్రతకు 20లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఎక్స్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మచ్చ ఫెడరేషన్ జిల్లా డైరెక్టర్తవిడబోయిన అజయ్ కుమార్ సంఘ సభ్యులు నీలం రాములు , గుండు అంజయ్య తవిడా బోయిన వెంకయ్య నీలం శివ పొన్నెబోయిన రామకృష్ణ నార్ల రవి హనుమంతు మహేష్ తదితరులు పాల్గొన్నారు*