calender_icon.png 19 November, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జీవితం నేటి తరానికి ఆదర్శం

19-11-2025 08:02:57 PM

ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్..

నార్సింగి/చేగుంట (విజయక్రాంతి): దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు, దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ అని మెదక్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్ అన్నారు. బుధవారం నార్సింగి మండల పరిధిలోని శేరిపల్లి లో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరా గాంధీ జీవితం, రాజకీయ నాయకులకు, ముఖ్యంగా మహిళలకు ఆదర్శమని అన్నారు.

భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, దిగ్విజయంగా అమలు పరిచారని, నవ భారత నిర్మాణానికి పునాదులు వేసిన ఘనురాలని కొనియాడారు. దేశ సేవలో ప్రాణాలను సైతం అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం అని . అమెరికా వంటి అగ్ర దేశాల వత్తిళ్లకు బెదరకుండా, లొంగకుండా, దేశ అభివృద్దే,లక్ష్యంగా పరిపాలన సాగించిన,ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అని, తన జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీరామ్ భరత్, మాజీ ఉప సర్పంచ్ చెప్యాల బాలాజీ, నాయకులు బాబు, లక్ష్మీ నరసింహులు, తాళ్ళ చిన్న కృష్ణా గౌడ్, జయరాం గౌడ్, చెప్యాల వెంకటేశం, అశోక్, చినబాబు, యూత్ నాయకులు బాలకృష్ణ గౌడ్, చెప్యాల విజయ్ కుమార్, నరసింహులు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.