calender_icon.png 1 July, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3 బీహెచ్‌కే విశ్వనాథ్‌కు అంకితం

29-06-2025 12:00:00 AM

హీరో సిద్ధార్థ్ 40వ చిత్రం ‘3బీహెచ్‌కే’. శ్రీగణేశ్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, దేవయాని, యోగిబాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మేకర్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ ఈవెంట్లో  హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “3 బీహెచ్‌కే’ ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చిన కథ. ఈ సినిమా చూసిన తర్వాత వెంటనే మా నాన్నను గట్టిగా హగ్ చేసుకోవాలనిపించింది. తండ్రీకొడుకుల రిలేషన్షిప్‌ని బొమ్మరిల్లు సినిమాలో చూశారు. ఆ సినిమా నాకు చాలా నేర్పించింది. అలాంటి సినిమా తర్వాత మళ్లీ తండ్రీకొడుకుల అనుబంధం గురించి ఇందులో చూస్తారు. శ్రీగణేశ్  ఈ కథ చెప్పినప్పుడే చాలా ఎమోషనల్‌గా అనిపించింది.

సొంత ఇల్లు అందరి కల. నేను కూడా చిన్నప్పుడు మా సొంతిల్లు కోసం ఎదురుచూశా. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇల్లు. ప్రొడ్యూసర్ అరుణ్ ఇప్పుడు ఉంటున్న ఇల్లు గతంలో కళాతపస్వి కే విశ్వనాథ్ ఉండేవారు. ఈ సినిమాను ఆయనకు అంకితం చేస్తున్నాం” అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీగణేశ్, నటీనటులు శరత్‌కుమార్, దేవయాని, నిర్మాత అరుణ్ విశ్వ, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.