21-05-2025 01:19:35 AM
మంథని, మే 20 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు వైభవంగా సాగుతున్నాయి. 6వ రోజు మంగళవారం సరస్వతీ నవరత్న మాలా హారతి మహోత్సవం నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రకాశవంతమైన దేవీ ఆరాధనకు కేంద్రంగా నిలిచిన సరస్వతీ నవరత్న మాలా హారతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సరస్వతీ అమ్మవారి హారతిని తిలకించి, దివ్యదర్శనం పొందారు. సరస్వతీ అమ్మవారికి రాష్ట్ర ప్రజల శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక హారతి, ధార్మిక ఉత్సవాలు సమాజంలో సానుకూల చైత న్యాన్ని కలిగిస్తాయన్నా రు. సరస్వతీ పుష్కరాలకు ప్రతి రోజు లక్షలాది మంది వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి, కాళేశ్వ ర ముక్తీశ్వర స్వామిని దర్శిం చుకుంటున్నారని తెలిపారు.
కాగా కాళేశ్వరంలో హైకోర్టు న్యాయమూర్తి సృజన మంగళవారం పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సరస్వతీ అమ్మవారి చిత్రప టాన్ని చైర్మన్ మోహన్‌శర్మ, ఆలయ అధికారులు అందజేశారు. 6వ రోజు కూడా త్రివేణి సంగ మం భక్తుల రాకతో కిక్కిరిసిపోయింది.
“కాళేశ్వర నివాసోవా, కాళేశ్వర నీరిక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప వినాశనం’ అని స్తుతిస్తూ భక్తులు త్రివేణి సంగమ తీరాన పవిత్ర సరస్వతి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల తీవ్రంగా పెరగడంతో కలెక్టర్ రాహుల్‌శర్మ పర్యవేక్షణలో అధికార యం త్రాంగం సేవలందించే విధుల్లో నిమగ్నం అయింది.
పుష్కరాల్లో విషాదం అస్వస్థకు గురై పారిశుద్ధ్య కార్మికుడి మృతి
కాళేశ్వరం పుష్కరాల్లో మంగళవారం విషాదం నెలకొంది. పుష్కరాల్లో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న మంతెన శ్రీనివాస్(35) ఎండ తీవ్రతకు అస్వస్థకు గురై మృతి చెందాడు. గత మూడు రోజులుగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఉన్నట్టుండి అస్వస్థకు గురయ్యాడు. మహాదేవపూర్ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి స్వస్థలం భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.