06-12-2025 07:06:11 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం 63వ హోంగార్డుల రైజింగ్ డే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల నిర్వహించారు. జిల్లా కేంద్రంలో హోంగార్డులతో కలిసి మొక్కలు నాటి వేడుకలను జరుపుకున్నారు. పోలీస్ భద్రతా చర్యలు హోంగార్డుల పాత్ర కూడా ఎంతో ప్రాధాన్యతలతో ఉంటుందని వారి సంక్షేమానికి పోలీస్ శాఖ చేస్తున్న కృషిని తెలిపారు. హోంగార్లకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు ఉపేందర్ రెడ్డి రాజేష్ మీనా హోంగార్డులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.