01-08-2025 06:58:54 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): దౌల్తాబాద్ మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామానికి చెందిన దేవుడి పెంటారెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Kotha Prabhakar Reddy) ఆదేశాల మేరకు దుబ్బాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిక్కుడు సత్యనారాయణ, నాయకులు జనార్దన్ రెడ్డి, దుర్గేష్, జయరాంరెడ్డి, నల్ల శ్రీనివాస్, చంద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.