24-01-2026 12:53:05 AM
కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి, జనవరి 23(విజయక్రాంతి): జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, కోహిర్, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలుజోగిపేట, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గడ్డపోతారం, గు మ్మడిదల మున్సిపాలిటీల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని శుక్రవారం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వ హణ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమి షనర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలోని 11 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 541 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వివరాలను ఇప్పటికే టీపోల్లో నమో దు చేయడం జరిగిందని, వచ్చిన అభ్యంతరాలను నిశితంగా పరిశీలించి పరిష్కరించినట్లు చెప్పా రు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమిస్తూ వారికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పా టు చేస్తున్నామని తెలిపారు.
బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ పేపర్ల ముద్రణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, నామినేషన్ స్వీకరణ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని మాట్లాడుతూ, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఎన్నికలను సాఫీగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుండి మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.