calender_icon.png 24 January, 2026 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డిలో శ్రీలంక ప్రతినిధుల బృందం పర్యటన

24-01-2026 12:54:27 AM

సంగారెడ్డి, జనవరి 23: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, స్థానిక పరిపాలన విధానాలపై అధ్యయనం చేసేందుకు శ్రీలంకలోని సిలోన్ వర్కర్ కాంగ్రెస్కు చెందిన సభ్యులు సంగా రెడ్డి జిల్లా కలెక్టరేట్ను సందర్శించారు. భారత ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మం త్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న 10 రోజుల అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శ్రీలంక ప్రతినిధుల బృందాన్ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో నువారా ఎలియా డిప్యూటీ మేయర్తో పాటు శ్రీలంకకు చెందిన 20 మంది ఎన్నికైన ప్ర జా ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక పరిపాలనలో సంస్థాగత సామర్థ్యాల బలోపేతం, ఉత్తమ పాలన విధానాలపై అవగాహన కల్పించడం, అలాగే భారత్‌శ్రీలంక దేశాల మధ్య పరస్పర అనుభవాల మార్పిడి ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.  అధ్యయన కార్యక్రమంలో భాగంగా అంతకు ముందు శ్రీలంక ప్రతినిధులు సంగారెడ్డి జిల్లాలోని ఫల పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు.

అక్కడ ఆధునిక వ్యవసాయ పరిశోధనలు, సాగు పద్ధతులు, రైతుల ఆదాయం పెంపు కోసం చేపడుతున్న చర్యలపై ఫల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక పరిపాలన వ్యవస్థ ప్రజల జీవితాల్లో నేరుగా మార్పు తీసుకువచ్చే శక్తివంతమైన సాధనమని అన్నారు. మహిళా సాధికారత, వ్యవసాయ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అంశాలను సమన్వయంగా అమలు చేసినప్పుడే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.