calender_icon.png 16 August, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయత, దేశభక్తి ఐక్యతను చాటిన తిరంగా ర్యాలీ

13-08-2025 12:02:53 AM

  1. తిరంగా మయమైన హిందూ నగరం 
  2. 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అర్బన్ బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ 

నిజామాబాద్ ఆగస్టు 12 (విజయక్రాంతి):  భారతదేశ స్వాతంత్ర సం గ్రామంలో భారతమాత సంకెళ్లు తెంచడానికి ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తునప్రాయంగా అర్పించారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.  స్వాతంత్ర పోరాటంలో ఆనాడు ఎందరో మహనీయులు ఇచ్చిన బలిదాన ఫలితమే మనం ఈరోజు స్వాతంత్రం పొంది స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నామని ఆయన అన్నారు.

అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ భారతదేశ ఐక్యతను జాతీయతను దేశభక్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా భారతదేశం అంతటా నరేంద్ర మోడీ పిలుపుమేరకు హార్గర్థిరంగా కార్యక్రమంలో భాగంగా హిందువునగరంలో తిరంగారాలి చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు స్థానికులు యువకులు వివిధ వర్గాల ప్రజలు ర్యాలీలో పాల్గొనడం తనకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు.

ప్రపంచ దేశాలు భారత వైపు చూస్తుంటే అందుకు కారణం మనలో ఉన్న దేశభక్తి సంస్కృతి సాంప్రదాయాలే అది ఆయన అన్నారు. చిన్నప్పటి నుండే పిల్లలలో దేశభక్తి పెంపొందించే విధంగా చత్రపతి శివాజీ మహారాజ్ జిజియాబాయి ఎలా దేశభక్తిని నూరు పోషించారు అలాగే ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులు తమ పిల్లలను శివాజీ మహారాజులుగా ఝాన్సీ లక్ష్మీబాయి  రాని రుద్రమ దేవిలా పిల్లలను తీర్చిదిద్దాలన్నారు.

79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ హిందువుల అర్బన్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ప్రముఖ కోడలి అయిన గాంధీ చౌరస్తా నుండి తిలక్ గార్డెన్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో ఎందరో పుడుతూ ఉంటారని కొందరు మాత్రమే చరిత్రలో నిలుస్తారని ఆ చరిత్రలో నిలిచిన వారే అమరులైన భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరులను వీరవనితలను ఆదర్శంగా తీసుకొని నేటి వారి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పాలించి భారతదేశాన్ని దోచుకుంటే మత ప్రతిపలాదికన దేశాన్ని విచ్చిన్నం చేసి భారత భూభాగాన్ని మూడు ముక్కలుగా విభజించిన ఘనత కాంగ్రెస్ డే అన్నారు 60 ఏళ్ల పాలనలో భారత దేశంలో భాగమైన కాశ్మీర్లో మన త్రివర్ణ పథకాన్ని ఎగరవేయలేదని ఆ పరిస్థితి మనం గమనించామన్నారు. ప్రధానమంత్రి మోడీగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాశ్మీర్లో వికసి త్ భారత స్వేచ్ఛ వాయు పీల్చుకుంటుందని ఆయన అన్నారు.

భారత వైపు కన్నెత్తి చూసే ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూరం ఒక గుణపాఠం అన్నారు.  ప్రపంచ దేశాలకే పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి భారత్ చేరుకుందని భారతీయులందరి లక్ష్యం జాతి పునర్నిర్మాణం భారత దేశన్ని విశ్వ గురువుగా చేయడమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి కార్పొరేటర్లు మండల అధ్యక్షులు బిజెపి నాయకులు విద్యార్థులు తదితరులు నగరవాసులు పాల్గొన్నారు.