calender_icon.png 17 August, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం ‘మహిళా మార్ట్’ భేష్

13-08-2025 12:00:00 AM

  1. భాగస్వాములైన ప్రతిఒక్కరికీ అభినందనలు
  2. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి) : ఖమ్మం జిల్లాకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులను, ఆ సంఘాల సభ్యులే మార్కెట్ చేసు కుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మంగళవా రం ‘ఎక్స్’ వేదికగా కొనియాడారు. వినూత్నమైన ఆలోచనతో మహిళా మార్ట్ ఏర్పాటు చేసుకున్నారని, వారి స్ఫూర్తితో రాష్ట్రంలో మరిన్ని స్వయం సహాయక సంఘాలు మా ర్ట్‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రజాప్రభుత్వ సంక ల్పం, అధికారుల కార్యాచరణ, ఆడబిడ్డల ఆచరణకు ప్రతిరూపమే ఖమ్మం మహిళా మార్ట్ అని కితాబునిచ్చారు. మార్ట్ ఏర్పాటు లో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు.