calender_icon.png 12 May, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి

10-05-2025 12:00:00 AM

సింగరేణి సీఎండీ,రెవెన్యూ మంత్రి వద్దకు ఐఎన్టీయూసీ నేతలు

మంచిర్యాల, మే 9 (విజయక్రాంతి) : సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర హౌసింగ్, రెవెన్యూ శాఖ మంత్రి, సింగరేణి సీఎండీ వద్దకు ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ బీ జనక్ ప్రసాద్ ఆధ్వ-ర్యంలో బృంద సభ్యులు కలిసి విన్నవించుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సీఎండీ బలరాం నాయక్‌ని, క్యాం పు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ముఖ్య నాయకుల బృందం కలిసి సమస్యలు వివరించారు. 

కార్మికుల సమస్యల కోసం సింగరేణి సీఎండీని...

సింగరేణి కార్మికులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎండీ బలరాం నాయక్ కు జనక్ ప్రసాద్ అధ్యక్షతన ఐఎన్టీయూసీ నాయకుల బృందం విన్నవించింది. ముఖ్యంగా పెరక్స్ పైన ఉన్న ఆదాయపన్ను (ఇన్కమ్ ట్యాక్స్) మాఫీ, సొంత ఇంటి పథకం అమలు, కార్పొరేట్ మెడికల్ బోర్డ్ మార్పు,

మెడికల్ అటెండెన్స్ నిబంధనల్లో సవరణ, డిస్మిసైన కార్మికుల సమస్య పరిష్కారం, హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, సింగరేణిలో ఐటీ కంపెనీ స్థాపన, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్లో ఉన్న 3,700 కంటే ఎక్కువ ఉద్యో గ సంబంధిత కేసుల పరిష్కారానికి ఒకే విడతలో లోక్ అదాలత్ నిర్వహించాలన్న విన్నవించారు. 

సొంతింటి కోసం రెవెన్యూ శాఖ మంత్రి వద్దకు

సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికుల సొంతింటి కోసం రాష్ట్ర హౌసింగ్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా బృందం కలిసి విన్నవించింది. సింగరేణి కార్మికుల కోసం సొంత ఇంటి పథకం త్వరితగతిన అమలు చేయాలనే విజ్ఞప్తి చేయడంతో మంత్రి సానుకూలంగా స్పందించిన ట్లు ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ బీ జనక్ ప్రసాద్ వెల్లడించారు.