20-10-2025 02:07:24 AM
కరీంనగర్, అక్టోబరు 19 (విజయక్రాంతి): “రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జరిగిన విషయాలపై సిద్దిపేటలోని వేంకటేశ్వర ఆలయంలో తాను తడిబట్టలతో ప్రమాణం చేసి నిజం చెప్తా. నువ్వు కూడా ప్రమాణం చేసి మంత్రివర్గ సమావేశంపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటావా?” అని మాజీ మంత్రి హరీశ్‌రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సవాల్ చేశారు. ఆదివారం కరీంనగర్ ఆర్‌అండ్ బి గెస్ట్ హౌస్‌లో మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కేవలం ప్రజా సంక్షేమంపైనే చర్చించామని, మరే ఇతర అంశాలపై చర్చించలేదని చెప్పారు. హరీశ్‌రావు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతూ దండుపాళ్యం బ్యాచ్ అని మంత్రులను అనడం సరికాదన్నారు. హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహి స్తున్న సిద్దిపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో తాను తడిబట్టలతో ప్రమా ణం చేసి నిజం చెప్తానని.. ఇందుకు హరీశ్‌రావు సిద్ధమేనా అని సవాల్ విసిరారు.
హరీశ్‌రావు అహంకారంతో అవహేళన చేస్తున్నాడని ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుంది బీఆర్‌ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్టే వస్తే కేటీఆర్ అనుచరులను ఆలింగనం చేసుకుని సంబురాలు చేసుకున్నాడని అన్నారు. గత ప్రభుత్వం లో ఏ మంత్రికి కూడా స్వేచ్ఛ లేదని, కొ ప్పుల ఈశ్వర్‌ను కూడా జరగవయ్యా అని నెట్టేశారని, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దళి త బిడ్డ రాజయ్యను తొలగించారని గుర్తు చేశారు.
ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మా అందరిని దగ్గర కూర్చోబెట్టుకుని చర్చిస్తారని వెల్లడించారు. కేటీఆర్ కుటుంబంపై కవిత చేసిన వ్యాఖ్యలు వినిపిస్తూ, నేరెళ్ల దళితులపై జరిగిన దాడిని వివరిస్తూ వీటికి హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డి మాండ్ చేశారు.
హరీశ్‌రావు ఆర్థిక మం త్రిగా ఉండి ఎస్సీ, గిరిజన సంక్షేమానికి కేం ద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని, ఆయనకు దళితులపై ఏమా త్రం ప్రేమ లేదని, పైగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న బీసీ, ఎస్సీ మంత్రులపై హరీశ్‌రావు దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ.. మంత్రుల మధ్య ఉన్న కుటుంబ సమస్యను తామే పరిష్కరించుకుంటామని అడ్లూరి సమాధానం చెప్పారు. మీడియా సమావేశంలో సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.