calender_icon.png 22 January, 2026 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం

18-09-2024 12:34:36 AM

యాదాద్రి భువనగిరి, (విజయక్రాంతి): ‘అమరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం’ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్, హైదరాబాద్‌లోని శాసన మండలి ఆవరణలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తొలి, మలిదశ ఉద్యమాల సమయంలో అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సామేల్, కలెక్టర్ హనుమంతు జండగే, డీసీపీ రాజేష్ చంద్ర పాల్గొన్నారు.