calender_icon.png 11 May, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే ప్రపంచ అందాల పోటీలు

10-05-2025 12:19:14 AM

-వైభవంగా మిస్ వరల్డ్ ఉత్సవాలు

-తెలంగాణ కళలు ప్రతిబింబించేలా కార్యక్రమాలు

-గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహణ

-కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): సం స్కృతి, సౌందర్యం రెండింటి మేళవింపుగా నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టా త్మకంగా నిర్వహిస్తోంది.

హైదరాబాద్ గచ్చిబౌళి ఇండోర్ స్టేడియంలో పోలీసుల కట్టుది ట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పోటీలు నిర్వహించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు ఈ పోటీల్లో తెలంగాణ సంస్కృతి, కళలు, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కార్య క్రమాలను రూపొందించారు.

రాష్ట్రానికి చెం దిన వివిధ రకాల జానపద, గిరిజన, శాస్త్రీ య కళలు, హైదరాబాది దక్కని కళారూపాలను ఈ ఉత్సవాల్లో సమ్మిళితం చేసి ప్రపం చవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేస్తు న్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రా ష్ర్ట గీతం ఆలాపనతో వేడుకలు ప్రారంభం అవుతాయి.

ప్రముఖ గాయకుడు, శిక్షకుడు కొమాండూరి రామాచారి శిష్య బృందం 50 మంది బృంద గీతంగా ఆలపిస్తారు. ఆ తర్వా త కాకతీయుల కాలం నంచి తెలంగాణ శాస్త్రీయ నృత్య రీతిగా ఖ్యాతి గడించిన పేరి ణి నాట్య ప్రదర్శన వైభవంగా జరగనుంది. 250 మంది మహిళా కళాకారిణులు పేరిణి లాస్య సంప్రదాయాన్ని అనుసరించి ఈ నృత్యాన్ని ప్రదర్శించబోతున్నారు.

సుందరీమణుల పరిచయ వేడుకలో తెలంగాణలోని వివిధ ప్రాంతాల కళకారుల ప్రదర్శన చేయనున్నారు. అందులో భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతానికి పట్టుగొమ్మగా నిలిచిన కొమ్ము కోయ కళాకారులు రామకృష్ణ బృందం ప్రదర్శన ఉంటుంది. ఆదిలాబాద్ ప్రాంతం నుంచి గోండు జాతి ప్రజల విశిష్ట కళారూపం గుస్సాడీ కళా ప్రదర్శన చేస్తారు.

తెలంగాణ జానపద సంప్రదాయానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచే డప్పులు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత అందే భాస్కర్ బృందం నిర్వహిస్తుంది. బం జారా మహిళల విన్యాసాలు స్వప్న బృం దంతో ప్రదర్శనకి వస్తాయి. ఒగ్గుడోలు కళా విన్యాసాలు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత చౌదరపల్లి రవి కుమార్ బృందంచే ప్రదర్శితమవనుంది.