calender_icon.png 8 September, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ..

08-09-2025 01:08:31 PM

పలువురికి గాయాలు..

మణుగూరు (విజయక్రాంతి): అశ్వాపురం మండల(Aswapuram Mandal) పరిధిలోని మిట్టగూడెం గురుకులం పాఠశాల వద్ద ప్రధాన రహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. మణుగూరు నుండి ఖమ్మం వెళ్తున్న మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఇటుక లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్నట్లు స్థానికులతో పాటు ప్రయాణికులు తెలిపారు. బస్సు డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేయడంతో డైవర్ తో పాటు, కండక్టర్, ప్రయాణికులకు, స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని  ప్రభుత్వ ఏరియా  ఆసుపత్రికి తరలించారు.  అయితే ప్రమాదంలో బస్సు ముందు  భాగం స్వల్పంగా దెబ్బతినగా ట్రాక్టర్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై నలభై నిమిషాల పాటు భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆశ్వాపురం, మణుగూరు సీఐలు అశోక్ కుమార్, నాగబాబులు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు.