calender_icon.png 1 July, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్‌తో పోరులో జెట్స్ నష్టపోయాం

01-07-2025 12:04:27 AM

నౌకాదళ కెప్టెన్ శివకుమార్ వ్యాఖ్య

న్యూఢిల్లీ, జూన్ 30: పాక్‌తో ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత నౌకాదళం కొన్ని జెట్లను కోల్పోయిందని నౌకాదళ కెప్టెన్ శివ్‌కుమార్ వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకుల ఆదేశాలతోనే పూర్తి స్థాయి దాడులు చేయలేదని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన మిలటరీ వ్యవస్థలను ఎట్టి పరిస్థితుల్లో తాకొద్దని సూచించారని, దీంతో మనం యుద్ధ విమానాలను కోల్పోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇండోనేషియాలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది. వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.