calender_icon.png 20 September, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంప్రదాయాలను గౌరవించాలి

20-09-2025 12:00:00 AM

డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి

కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడా పాఠ శాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి హాజరైన డిడి విద్యార్థినిలు, ఉపాధ్యాయురాలతో బతుక మ్మ ఆడారు.

అనంతరం మాట్లాడుతూ దసరా సెలవులలో విద్యార్థులు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంబరాలు జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటీడీవో లు చిరంజీవి, శ్రీనివాస్, సాయిబాబా, విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.