calender_icon.png 13 January, 2026 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమవరంలో ట్రాఫిక్ జామ్

13-01-2026 02:11:53 AM

అమరావతి, జనవరి 12: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందడి పెద్ద ఎత్తున కనిపిస్తోంది. పండగకి హైదరాబాద్ తదితర నగరాల్లో ఉన్నవాళ్లంతా సొంతూళ్లకు భారీగా తరలి వస్తున్నారు. దీంతో వచ్చే వాహనాలతో నగర, పలు పట్ణణ రహదారులపై తీవ్ర రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రహదారులు అన్నీ సోమవారం ఉదయం నుంచి వాహనాల రద్దీ నెలకొంది. కొన్నచోట్ల పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపో యింది. ముఖ్యంగా భీమవరం చినవంతెన నుంచి రెండు కిలోమీటర్లు పొడవునా ద్విచక్ర వాహనాలు నిలిచిపోయాయి. ప్రకాశం చౌక్, అంబేద్కర్ కూడళ్లలో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది.