29-08-2025 06:40:00 PM
గాంధారి,(విజయక్రాంతి): గత రెండు రోజులు నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా అవుసుల కుంట సోమారం తండా మధ్యలో బ్రిడ్జి తెగిపోయింది. విషయం స్థానిక ప్రజలతో తెలుసుకొని సంఘటన స్థలాన్ని గాంధారి ఎస్సై ఆంజనేయులు సందర్శించి గాంధారి మండల ఉన్నతాధికారులకు తెలియజేశారు. సాధ్యమైనంత త్వరలో రోడ్డును బాగు చేయాలని అధికారులకు సూచించారు.ఎస్సై వెంట ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం గాంధారి మండల అధ్యక్షుడు బొట్టు మోతిరం, తాండ ప్రజలు తదితరులు ఉన్నారు.