29-08-2025 06:43:56 PM
మునిపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు అందజేస్తున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు మండలంలోని చీలపల్లి గ్రామంలో చీలపల్లి గ్రామపంచాయతీ సెక్రెటరీ మఠం రాము, ఆత్మ కమిటీ డైరెక్టర్ అనంతి బీరప్ప లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హలైన లబ్దిదారులందరికి రేషన్ కార్డులు అందించడం జరుగుతుందన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ్మ సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామన్నారు.