29-08-2025 06:36:43 PM
గాంధారి,(విజయక్రాంతి): గాంధారి మండల కేంద్రంలో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రంలో నివాస గృహాలు కూలిపోవడం జరిగింది. దీంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం రోజున కూలిన నివాస గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు మాట్లాడుతూ... ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు వరద బాధితుల వివరాలు ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మండల కేంద్రంలో గాని పక్క గ్రామాలలో వర్షానికి ధ్వంసమైన దెబ్బతిన్న ఇండ్లను అధికారులు పరిశీలించి నివేదిక అందజేయాలని. అలాగే పంట నష్టం కూడా పరిశీలించి ప్రభుత్వానికి అందజేయాలని తూర్పు రాజులు కోరారు అలాగే ధ్వంసమైన ఇండ్లను స్థానంలో బాధితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కృషి చేస్తామని ఆయన అన్నారు.