calender_icon.png 10 July, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుజరాత్‌లో విషాదం

10-07-2025 01:27:48 AM

- వడోదరలో కుప్పకూలిన గంభీర వంతెన

- మహిసాగర్ నదిలో పడిపోయిన వాహనాలు.. 13 మంది జల సమాధి

- ఘటనపై విచారణకు సీఎం భూపేంద్ర పటేల్ ఆదేశాలు

వడోదర, జూలై 9: గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వడోదర, ఆనం ద్ జిల్లాలను కలిపే మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటన సమయంలో వంతెనపై నుంచి వెళుతున్న ఐదు వాహనా లు నదిలో పడిపోయాయి.ఈ ప్రమాదంలో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురిని సహాయక బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ఆపరేషన్ కొన సాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రమాదం విషయం తెలియగానే అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 1985లో నిర్మించిన ఈవంతెన పాతబడటంతో పాటు కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూలిపోయి ఉండొచ్చని అధికారులు అ భిప్రాయం వ్యక్తం చేశారు. వంతెన కూలిన ఘటనపై ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. కాగా బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున పరి హారం ప్రకటించారు.పురాతన వంతెన కావ డంతో సీఎం ౩ నెలల క్రితమే 212 కోట్ల వ్యయంతో కొత్త వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపారు. డిజైన్, టెండర్ల ప్రక్రియ తరుణంలో విషాదం చోటుచేసుకుంది.