18-09-2025 09:54:54 PM
రేగొండ/భూపాలపల్లి (విజయక్రాంతి): లంబాడీల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు(MLA Satyanarayana Rao) అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే గురువారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కుంటపల్లి 11 వ వార్డులో జరిగిన లంబాడీల తీజ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు గ్రామస్తులు, పెళ్లి కాని యువతులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం డీజే పాటలకు యువతులతో కలిసి ఎమ్మెల్యే స్టెప్పులు వేసి సందడి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ తీజ్ పండుగలో పెళ్లి కాని యువతులు ఆట పాటలతో ఆనందంగా పాల్గొనడం మన ఆచారాలు, విలువలను భావితరాలకు తీసుకు వెళుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లంబాడీ కులస్తుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, లంబాడీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించేలా కృషి చేస్తుందని అన్నారు.