calender_icon.png 19 September, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతరం మొక్కలు నాటుతూ, పర్యావరణాన్ని కాపాడుతున్న గ్రీన్ భద్రాద్రి సేవలు అభినందనీయం

18-09-2025 09:57:54 PM

భద్రాచలం సబ్ కలెక్టర్ శ్రీ మృణాల్ శ్రేష్ట 

భద్రాచలం (విజయక్రాంతి): డిగ్రీ కళాశాల ప్రక్కన ఉన్న కరకట్టపై, గ్రీన్ భద్రాద్రి వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి భద్రాచలం సబ్ కలెక్టర్ శ్రీ మృణాల్ శ్రేష్ట(Sub Collector Mrunal Shrestha) ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ, ఎటువంటి లాభాపేక్షలేకుండా నిరంతరం మొక్కలు నాటుతూ, వాటిని సంరక్షిస్తూ, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న గ్రీన్ భద్రాద్రి సంస్థ సేవలు అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపట్టాలని, మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు చిట్టే లలిత, కో ఆర్డినేటర్ పామరాజు తిరుమలరావు, పాస్ట్ ప్రెసిడెంట్స్ పల్లింటి దేశప్ప, కామిశెట్టి కృష్ణార్జునరావు, గంగాధర వీరయ్య, బిర్రు సుధాకర్, రామరాజు, సుభాష్ నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.