calender_icon.png 19 September, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఆంధ్రా కింగ్’.. ఉపేంద్ర బర్త్‌డే స్పెషల్ పోస్టర్

18-09-2025 10:28:44 PM

రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూక’. మహేశ్‌బాబు పీ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్, రెండు పాటలు ఈ సినిమాపై అంచనాలేర్పడ్డాయి. ఒక అభిమాని బయోపిక్‌గా ఉండబోతోందీ చిత్రం. ఇందులో హీరో రామ్ డై-హార్డ్ సినిమా ఫ్యాన్‌గా అలరించబోతున్నారు. ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. రావు రమేశ్, మురళీశర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీ గణేశ్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఉపేంద్ర ఇందులో ‘ఆంధ్రా కింగ్’గా కనిపించనున్నారు. గురువారం ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఉపేంద్ర సూపర్ స్టార్ అవతార్‌లో అభిమానులకు అభివాదం చేస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీతం: వివేక్, మెర్విన్; సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని; ఎడిటర్: శ్రీకర్‌ప్రసాద్; ఆర్ట్: అవినాష్ కొల్లా; నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్; కథ మహేశ్‌బాబు పీ.