18-09-2025 09:43:44 PM
చిన్న చింతకుంట: చిన్నచింతకుంట మండల ఎస్సైగా గురువారం కృష్ణ ఓబుల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ జిల్లా ఇంటలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తూ సీ.సీ కుంట ఎస్సైగా వచ్చారు. సీసీ కుంట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రామ్ లాల్ నాయక్ మహబూబ్ నగర్ విఆర్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ మండల ప్రజల సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణ కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జూదం అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్సై సూచించారు.