18-09-2025 09:33:44 PM
కొండపాక: పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొండపాక మండలం దమ్మకపల్లి శివారులోని పిట్టల వాడలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు కుకునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన మేరకు పిట్టల వాడకు చెందిన గుజరాతి చంద్రయ్య కూతురు రజిత(22) అనే యువతి బుధవారం రాత్రి ఇంట్లో పత్తి చేనుకు తెచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. కాగా రజిత వారి దూరపు బంధువైన వ్యక్తిని ప్రేమిస్తున్న విషయం తల్లిదండ్రులకు తెలియడం తో తల్లిదండ్రులు చదువు పూర్తయిన తర్వాత చూద్దామని ఏడు నెలల క్రితం చెప్పి ఒప్పించారు. ఇంతలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కుకునూరు పల్లి ఎస్ ఐ శ్రీనివాస్ తెలిపాడు.