అనంతగిరి: మండల పరిధిలోని రంగయ్య గూడెం గ్రామంలో వీధి దీపాలు లేక అంధకారంలో మగ్గుతున్నాయని సయ్యద్ సిరాజ్ అన్నారు. గురువారం పత్రిక ప్రకటన ద్వారా మాట్లాడుతూ మా గ్రామం చీకట్లు కమ్ముకుంటున్నాయి. వీధిలైట్ల నిర్వహణ పారిశుద్ధ్యం ఇతరత్రా సమస్యలు గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. సుమారుగా వర్షాకాలం స్టార్ట్ అయ్యి కొన్ని నెలలు గడుస్తున్నా.. రంగయ్య గూడెం గ్రామంలో పాములు పురుగులు వస్తున్న వీధిలైట్లు వెలగక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని గ్రామవాసి సిరాజ్ మండిపడ్డారు. కనీసం పారిశుద్ధ్యం త్రాగునీరు సమస్యను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం బ్లిజంగ్ పౌడర్ కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది చల్లడం లేదని అన్నారు. ఇంట్ల ఈగలతో బయట దోమలతో రకరకాల జ్వరాలు వస్తున్నాయి అని, అధికారులపైన తీవ్రంగా ఆరోపించారు. అంతే కాకుండా ఎంపీడీవోకి ఏ అధికారికి చెప్పిన ఎవరూ పట్టించుకోవడంలేదని తెలిపారు. ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.