18-09-2025 09:36:35 PM
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
చిన్న చింతకుంట: ప్రజా ప్రభుత్వం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్లకు అండగా ఉంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి(MLA Madhusudan Reddy) తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ఎమ్మెస్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో నూతన ఫోటోగ్రాఫర్ల సంఘం సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్లు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. జ్ఞాపకాలకు తీపిగుర్తుగా ఫోటో నిలుస్తుందని, ఈ వృత్తిలో ఉన్న ఫోటోగ్రాఫర్లకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. ఫోటోగ్రాఫర్ల సొంత భవనానికి నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కోరారు. ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని తహసిల్దార్ ఎల్లన్నకు ఆదేశించారు. ఫోటోగ్రాఫర్లు ఐక్యంగా ఉంటూ కుటుంబ భరోసా పథకం ఎంతో బాగుందని ఫోటోగ్రాఫర్ల కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి అండగా కుటుంబ భరోసా పథకం నిలుస్తుందని ఇలాంటి పథకం తీసుకురావడం ఎంతో అభినందనీయమన్నారు.
మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల సంఘం అధ్యక్షులుగా పీటర్ ,ఉపాధ్యక్షులుగా రాఘవేందర్, ప్రధాన కార్యదర్శిగా విద్య సాగర్, కోశాధికారిగా శరత్ కుమార్, కుటుంబ భరోసా ఇన్చార్జ్ ఖాదర్, ఇసాక్ లతోపాటు కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందించి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ల సంఘం సభ్యులను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కథలప్ప, విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు కుమ్మరి నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు, గోపి జిల్లా కుటుంబ భరోసా ఇన్చార్జి సత్యనారాయణ, నాయకులు జి.జి పౌలు, ఎస్ వెంకటేష్, ఎల్ఐసి మహమూద్, వజిర్ బాబు, జహంగీర్, ఫోటోగ్రాఫర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.