calender_icon.png 19 September, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి ప్రదర్శనలకు ఎంపిక

18-09-2025 10:06:25 PM

పాల్గొన్న ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాస్థాయి ఎఫ్ఎల్ఎన్ టిఎల్ఎం మేళ శ్రీ రాజరాజేశ్వర గార్డెన్ నిర్మల్ నందు జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి, జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న సందర్శించి 19 మండల స్థాయిలో ఎంపిక కాబడి జిల్లా స్థాయికి వచ్చినటువంటి 190 టిఎల్ఎంలను విషయ నిపుణులైన ఎంఈఓ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పరిశీలించి విజేతలను నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క టిఎల్ఎం పాఠశాల స్థాయిలో ఏ విధంగా విద్యార్థులకు అమలు పరుస్తారో వాటి ద్వారా పిల్లల సామర్థ్యాలను ఏ విధంగా అభివృద్ధి పరుస్తారో ఉపాధ్యాయులతో చర్చించి సంతృప్తిని వ్యక్తపరచడం జరిగింది.

అదేవిధంగా ఈ కృత్యాలను పాఠశాల స్థాయిలో అమలుపరిచి ప్రతి విద్యార్థి చదవడం, రాయడంలో ముందంజలో ఉండేటట్టు కృషి చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న, అకాడమిక్ మానిటరింగ్ అధికారి నరసయ్య, సంయుక్తంగా మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో అభ్యసన బోధనలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించి విద్యార్థులలో సబ్జెక్టుకు సంబంధించిన సామర్ధ్యాలను అలాగే అభ్యసన ఫలితాలు రాబట్టే విధంగా ఉపాధ్యాయులు బోధించాలని అన్నారు. ఈరోజు ప్రదర్శించిన కృత్యాల ద్వారా పిల్లలలో సామర్ధ్యాలను సాధించడానికి సులువుగా ఉపయోగపడతాయని  కావున వీటిని తరగతి బోధనలో ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి ఎఫ్ఎల్ఎన్ టిఎల్ఎం  మేళాలో 190  ప్రదర్శనలు ప్రదర్శించగా అందులో నుండి ఎనిమిదింటిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరిగింది. 

రాష్ట్ర స్థాయికి ఎంపికైన విజేతల వివరాలు:

1) ఆర్.రమేష్ బాబు MPPS కడ్తాల్, 

2) మొబీన్ అహ్మద్,MPPS ఒవైసీ నగర్.

3) బి.శ్వేత,MPPS పీచర,

4) ఎ. ప్రవళిక,MPPS నిగ్వా,

5) ఎం. ఎల్లన్న MPPS వానల్ పాడ్

6) టి.వెంకట రాజం.MPPS పేర్కపల్లి.

7)కావ్య, MPPS లింగాపూర్.

8) మెహరున్నీస MPPS నవాబ్ పేట్

సర్టిఫికెట్, మెమెంటోతో ఆర్జేడీ, డీఈవో సత్కరించి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు తెచ్చిపెట్టేలా కృషి చేయాలని చెప్పడం జరిగింది.