18-09-2025 10:37:59 PM
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కే-ర్యాంప్'. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంష్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్నారు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తుండగా, నరేశ్, సాయికుమార్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 30 రోజుల్లో థియేట్రికల్ రిలీజ్‌కు వస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా మేకింగ్ వీడియోను మేకర్స్ గురువారం విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్; డీవోపీ: సతీశ్‌రెడ్డి మాసం; యాక్షన్: పృథ్వీ; ఎడిటర్: ఛోటా కే ప్రసాద్; ఆర్ట్: బ్రహ్మ కడలి.