calender_icon.png 18 September, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

18-09-2025 09:44:43 PM

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం, మంగళపల్లి, బొంగుళూర్ పలు పరిసరాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. గురువారం మధ్యాహ్నం ఎండ ఉక్కపోతగా ఉండి, సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఎడతేరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వివాహనదారులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లు చెరువులను తలపిస్తూ అద్వానంగా మారడంతో, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.