calender_icon.png 26 September, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం

26-09-2025 07:18:19 PM

దౌల్తాబాద్: గ్రామ పంచాయతీ,ఎంపీటీసీ,జడ్పీటీసీ 2025 సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు దొమ్మాట రైతు వేదికలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పోలింగ్ కేంద్రాల్లో అనుసరించవలసిన నిబంధనలు, ఓటింగ్ యంత్రాల వినియోగం, పోలింగ్ రోజు తీసుకోవలసిన చర్యలపై అధికారులకు వివరణాత్మకంగా తెలియజేశారు. ఎన్నికలు న్యాయసమ్మతంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ప్రిసైడింగ్ అధికారి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు.