calender_icon.png 7 July, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ హక్కులను అణిచివేస్తున్నారు

27-11-2024 12:35:16 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26(విజయక్రాంతి): ఆదివాసీ హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ప్రొఫెసర్ లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు, వక్తలు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీయులను ఎన్‌కౌంటర్ చేస్తున్నాయని వారు ఆరోపించారు.