07-07-2025 10:14:37 PM
పేదల వైపు నిలబడ్డ నిజమైన పోరాట యోధుడు మంద కృష్ణ మాదిగ..
వెంకటాపురం ఇంచార్జి వావిలాలస్వామి మాదిగ..
నూగురు వెంకటాపురం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) నూగురు వెంకటాపురం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తోకల శివ మాదిగ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ మెయిన్ రోడ్ ఆవరణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మార్పీఎస్, మండల ఇన్చార్జి వావిలాల స్వామి మాదిగ మాట్లాడుతూ... ఈ దేశంలో అట్టడుగు పేద వర్గాలకు వారి బ్రతుకుల్లో వెలుగులు నింపాలని లక్ష్యంతో గత 31 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగన్న నేతృత్వంలో ఉద్యమాలు చేసి సాధించిన వృద్ధులు వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పెంపు పథకాలే పేదల వైపు నిలబడ్డ నిజమైన పోరాటమని పేద మహిళలపై హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే వాటిని నిర్మూలించాలనే పోరాటం చేసి ఫాస్ట్ ట్రాక్ చట్టాలనూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సాధించామని అదే విధంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్ సాధించిన చరిత్ర మాదిగ దండోరా దేనని వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ హెచ్చింపు కై పోరాట చరిత్ర పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న ఉద్యమాన్ని మరువద్దని రాజకీయ పార్టీలకు ప్రజాస్వామ్య మేధావులకు విజ్ఞప్తి చేశారు.
ఈ దేశంలో అన్యాయంగా జైలు పాలు అయితే ఈ ఉద్యమకారులను విడుదల చేయాలని పోరాట కార్యచరణ తీసుకొని ఉద్యమ నాయకులను విడుదల చేయించిన చరిత్ర మందకృష్ణ మాదిగ ఉద్యమ చరిత్రను మరవద్దని ఈ గ్రామంలోని ఆదివాసి ప్రజలు, దళితులు, మహాజన వాదులందరు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న ఆలోచనలో మహాజన సోషలిస్టు రాజ్యాధికారాన్ని పట్టం కట్టాలని పిలుపునిచ్చారు అదే విధంగా మందకృష్ణ మాదిగన్న జన్మదినమైన జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 31సం రము అడుగు పెట్టిన సందర్భంలో ప్రతి మాదిగ గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా గద్దెలలో ఎమ్మార్పీఎస్ జెండాలను ఆవిష్కరించి గ్రామాలలో మాదిగ దండోరా పండుగలు జరుపుకున్నారు.