07-07-2025 10:33:35 PM
ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిడం జంగుదేవ్ పటేల్..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): కాలేజీ విద్యర్థులని కాలేజీకి వెళ్ళనివ్వకుండా పార్టీ మీటింగ్ లకు పంపుతూ రాజకీయ నాయకుల వద్ద డబ్బులు తీసుకుంటూ పబ్బం గడుపుకుంటున్న లక్షేటిపేట మోడల్ డిగ్రీ కాలేజ్(Model Degree College) నైట్ వాచ్మెన్ శనిగారపు సన్నీని వెంటనే విధుల నుండి తొలగించాలని ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సిడం జంగుదేవ్ పటేల్ సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీడం జంగుదేవ్ పటేల్ మాట్లాడుతూ.. హాస్టల్ విద్యార్థుల్ని మభ్యపెట్టి డబ్బులు ఆశ చూపి క్యాటరింగ్ లకు సప్లై చేస్తున్నాడని అన్నారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నాడన్నారు.
అసలు నైట్ వాచ్ మెన్ డేలో కాలేజీలో ఏంఏం చేస్తున్నాడని డే లో కాలేజీలో ఏం పని? అక్కడున్న సీసీ కెమెరాల్లో క్లియర్ గా చూపిస్తుందన్నారు. మాట వినని విద్యార్థుల్ని బెదిరించడం భయపెట్టడం శనిగారపు సన్ని కి మామూలే.. ఓపెన్ ఎగ్జామ్ రాసే విద్యార్థుల దగ్గరి నుండి చందాలు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. అధికారులు విచారణ జరిపి శనిగారపు సన్నీ నీ విధుల నుండి తొలగించి విద్యార్థుల భవిషత్తు నీ కాపాడాలని అధికారులని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మంగం దీపక్, పెందుర్ తుకారాం,ఉపాధ్యక్షులు,మోతిరాం,కొమరం కోటేశ్వర రావు, తుడుం దెబ్బ అధ్యక్షులు త్రిమూర్తి, జనార్ధన్, బపురావు, గోద్రురావు పాల్గొన్నారు.