07-07-2025 10:41:54 PM
వాజేడు (విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు మండలంలో సోమవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు(MLA Tellam Venkata Rao) పర్యటించారు. ఈ పర్యటనలో మండల కేంద్రంలో ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న రైతుల నష్టపరిహాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. వాజేడు మండలంకు చెందిన కుప్పిలి వెంకటేష్ 29 వేల రూపాయల చెక్కు, లక్ష్మీ శిరీష 25 వేల 5 వందల రూపాయల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, పిఎసిఎస్ ఉపాధ్యక్షులు వత్సవాయి జగన్నాథరాజు, తదితర కార్యకర్తలు కాంగ్రెస్ యూత్ నాయకులు పాల్గొన్నారు.