07-07-2025 10:38:37 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులకు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు నాగరాజు అన్నారు. సోమవారం రాయపోల్ మండల(Raipole Mandal) కేంద్రంలో పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే పాఠశాలలో సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పచ్చని చెట్లు, విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యాబోధన చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి తరగతి గది, పాఠశాల ఆవరణ మొత్తం సీసీ కెమెరాలు పరిధిలో ఉంటుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పాఠశాల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు..